ఈ రోజు రాయాలనుకున్నాను .. కాని ఈ రోజే రాస్తానని అనుకోలేదు... ఇది జరిగి చాలా కాలమయింది. స్నేహితులతో కలిసి కార్వార్ లో ఒక నిర్మానుషమైన సముద్ర తీరంలో, గతానికి భవిష్యత్తుకీ నడుమ ఈదుతూ సూర్యాస్తమయం చూస్తున్నాం. ఎందుకో సంధ్యా వందనం చెయ్యాలనిపించింది, మనకా మంత్రాలు రావు .. సరే మునకైన వేద్దామని దిగినప్పుడు ఒక చెప్పారని అనుభూతి కలిగింది. పసుపు రంగు నుంచి ఎరుపు రంగుకి మారుతున్న సూర్యుడు - లోకంలో జరుగుతున్న రక్తపాతాన్ని అవతలి ఒడ్డుకి చేర్చి, ఇదే కడలిలో మునిగి ... మరల అంతే స్వచ్చంగా మన ముందుకు వస్తానని చెబుతున్నట్టనిపించింది. తన కర్తవ్యాన్ని తు. చ. తప్పక పాటించే దినకరునికి నమస్కరిస్తున్నప్పుడు ఒక అల పాదాల కింది నుంచి ఇసుకని పట్టుకుపోయింది. నిలవటం చేతగాక నీళ్ళలో పడ్డ ఆ సమయం లో తెలుసుకున్నాను ఆ అల మట్టితో పాటే నాలోని అహంకారాన్ని కూడా కొద్దికొద్దిగా తీసుకెళ్లిoదని. మరొక్క జీవన రహస్యం ఆ రోజే అర్థమయింది... భవ సాగరం అని ఎందుకంటారని!! నీళ్ళలో తేలడం అంటే , వినడమే గాని ఎప్పుడు ప్రయత్నం చెయ్యలేదు. అదేదో పెద్ద యోగాసనం అనుకున్నా కాని ఇంతేనా అనిపించేలా నేర్పించాడు నా మిత్రుడు. ఒక్క మాటలో చెప్పాలంటే "సమర్పణ" .. "Total Submission" - నువ్వు ఎప్పుడైతే కడలికి నిన్ను సంపూర్ణంగా సమర్పిస్తావో, ఆ క్షణమే నువ్వు తేలుతావు అని !! అప్పటినుంచి జీవితం పైన నా అభిప్రాయం కొద్దికొద్దిగా మారుతూ వస్తోంది ... మర్పోక్కటే స్థిరం అన్నట్టు గుండెను తాకిన అల ఒకటి మనసును మర్చుతూనే వుంది ... వేదాంతం చెప్పాల్సిన వయసేనా నీది ?? అని చాల మంది అడుగుతుంటారు మరి వాళ్ళకి సమాదానం నా దగ్గర లేదు !! వయసుకి మనసుకి ఉన్న అనుబంధాన్ని వివరించే అనుభవం నాకు లేదు. కానీ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అన్నది నా అభిప్రాయం :)
Total submission anna padam vadav ante, neelo chala depth undi ra...
రిప్లయితొలగించండిadi cheppinantha thelika kakapoyina, aa padam vadataniki kuda chala dhairyam uSELF ndali...
ippude intha vedamthanni avahinchukunnav ante. mothaniki edo undi....
Age vishyam lo nuv cheppindi chala nijam...
Mana gurinchi manam thelsukovadaniki,
vedamthaniki vayasuki eppudu samdandham ledu
You keep it up.. evraina unte nen chuskunta