ఎందరో మహానుభావులు , అందరికీ వందనములు!! బ్లాగ్స్ రాయడం నాకు బాగా అలవాటే , కానీ ఇది నా తొలి తెలుగు ప్రయత్నము!! అంతేకాక నా భాషా జ్ఞానము అల్పమైనందున ఒప్పులను మన్నించి తప్పక మాకు తెలియపరుచవలసిందిగా మనవి :) (దీనికి కారణం నా విద్యాభ్యాసం తెలుగు నేలలో జరుగక పోవడమే!!) . నాకు పౌరాణిక చిత్రాలపైన చిన్నప్పటి నుంచి మంచి ఆసక్తి వుంది. రామాయణ మహాభారత కథలపై ఆధారితమై వచ్చిన చిత్రాలను వెతికి వెతికి చూస్తుంటాను. స్వర్గీయ ఎస్. వి. రంగారావుగారు, నందమూరి తారక రామారావు గారు నటించిన మాయాబజార్ చిత్రాన్ని ఎన్ని సార్లు చూసానో గణించడం కష్టం!! అలాగే దాన వీర శూరకర్ణలో రామారావు గారు పోషించిన పాత్రల వైశిష్ట్యత, అందులో దుర్యోధన పాత్రలో ఆయన కనబరచిన నటన మరువటం అంటూ ఉండదు!! అందులోని ప్రతి డైలాగ్ ప్రేక్షకులను అలరించినవే!! అందులో నాకు నచ్చిన పాంచాలి డైలాగ్ ఎంత వెతికినా దొరక్క పోవడంతో దాన్ని జనాలకు అందేలా చేద్దామని నేను చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం.
గమనిక : ఇందులోని అనేక పదాలకు నాకు అర్థం తెలియదు, కాబట్టి అందులో తప్పులు ఉండవచ్చు, తెలిసిన వారు సరైన పదం మాకు కామెంట్స్ మూలంగా తెలియజేస్తే తప్పక సరిదిద్దుకుంటాం :)
పాంచాలీ... పంచభర్తృక,.... ఏమే.... ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము.....ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయశల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశిజనిత రాకాసుధాకరవరవంశసముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్య ధౌరేయుండనై, నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై, పరమేశ్వరపాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్నుచూచి..... ఒక్క ఆడది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ బంధకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... హ అవునులే..... ఆ బయసిమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వత్సరపర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... నేనేల కటకట పడవలె? ఊరకుక్క ఉచితానుచితజ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...?
హఁ ఈ లోకము ముయ్య మూకుడుండునా.........!?
అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె?
వచ్చితిమిఫో......! దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభా భవనము మాకేలవిడిదికావలె?
అయినది ఫో... అందు చిత్రచిత్రిత విచిత్ర లావణ్యలహరులలో ఈదులాడు జిఘృక్షాపేక్ష అహ్హా... మాకేల కలుగవలే?
కలిగినది ఫో.. సజీవ జలచర సంతాన వితానములకాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోటీరకోటీ తటోత్క్షిప్తరత్నప్రభానీరాజి
తమగు మా పాదపద్మమేల అపభ్రంశమందవలె? ఏ
తత్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె? వీక్షించవలె?
పరిహసించవలె?.... హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ. ...హతవిధి...
ఆజన్మశత్రువులేయని అనుమానించుచునే యరుదెంచిన మమ్ము అవమాన బడబానల జ్వాలలు
దగ్ధమొనర్చుచున్నవి మామా....విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము
చేయించిన నీ విజ్ఞాన విశేషవిభవాధిక్యములు ఏమైనవి మామా?....
పాంచాలీ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...?
పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? ఇస్సీ... ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా?..
ఇపుడేదీ కర్తవ్యము? మనుటయా.. మరణించుటయా.. ఏదీ కర్తవ్యము ?
గమనిక : ఇందులోని అనేక పదాలకు నాకు అర్థం తెలియదు, కాబట్టి అందులో తప్పులు ఉండవచ్చు, తెలిసిన వారు సరైన పదం మాకు కామెంట్స్ మూలంగా తెలియజేస్తే తప్పక సరిదిద్దుకుంటాం :)
దాన వీర శూరకర్ణ డైలాగ్ :
పాంచాలీ... పంచభర్తృక,.... ఏమే.... ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము.....ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయశల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశిజనిత రాకాసుధాకరవరవంశసముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్య ధౌరేయుండనై, నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై, పరమేశ్వరపాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్నుచూచి..... ఒక్క ఆడది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ బంధకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... హ అవునులే..... ఆ బయసిమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వత్సరపర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... నేనేల కటకట పడవలె? ఊరకుక్క ఉచితానుచితజ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...?
హఁ ఈ లోకము ముయ్య మూకుడుండునా.........!?
అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె?
వచ్చితిమిఫో......! దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభా భవనము మాకేలవిడిదికావలె?
అయినది ఫో... అందు చిత్రచిత్రిత విచిత్ర లావణ్యలహరులలో ఈదులాడు జిఘృక్షాపేక్ష అహ్హా... మాకేల కలుగవలే?
కలిగినది ఫో.. సజీవ జలచర సంతాన వితానములకాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోటీరకోటీ తటోత్క్షిప్తరత్నప్రభానీరాజి
పాంచాలీ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...?
పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? ఇస్సీ... ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా?..
ఇపుడేదీ కర్తవ్యము? మనుటయా.. మరణించుటయా.. ఏదీ కర్తవ్యము ?
గమనిక : ఇది భైరవభట్ల కామేశ్వర రావుగారి సహకారంతో సరిదిద్దిన పిమ్మట ప్రచురించబడినది.
మంచి రచన
రిప్లయితొలగించండిGood
తొలగించండిచాల మంచి ప్రయత్నం చేసావ్.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిgood try ..keep it up ..
రిప్లయితొలగించండినాకు తెలినంత వరకూ సరిదిద్దిన పాఠం:
రిప్లయితొలగించండిపాంచాలీ... పంచభర్తృక,.... ఏమే.... ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము.....ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయశల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశిజనిత రాకాసుధాకరవరవంశసముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్య ధౌరేయుండనై, నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై, పరమేశ్వరపాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్నుచూచి..... ఒక్క ఆడది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ బంధకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... హ అవునులే..... ఆ బయసిమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వత్సరపర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... నేనేల కటకట పడవలె? ఊరకుక్క ఉచితానుచితజ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...?
హఁ ఈ లోకము ముయ్య మూకుడుండునా.........!?
అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె?
వచ్చితిమిఫో......! దివ్యరత్న ప్రభాసముపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభా భవనము మాకేలవిడిదికావలె?
అయినది ఫో... అందు చిత్రచిత్రిత విచిత్ర లావణ్యలహరులలో ఈదులాడు జిఘృక్షాపేక్ష అహ్హా... మాకేల కలుగవలే?
కలిగినది ఫో.. సజీవ జలచర సంతాన వితానములకాలావాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోటీరకోటీ తటోత్క్షిప్తరత్నప్రభానీరాజితమగు మా పాదపద్మమేల అపభ్రంశమందవలె? ఏ తత్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె? వీక్షించవలె? పరిహసించవలె?.... హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ....హతవిధి... ఆజన్మశత్రువులేయని అనుమానించుచునే యరుదెంచిన మమ్ము అవమాన బడబానల జ్వాలలు దగ్ధమొనర్చుచున్నవి మామా....విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషవిభవాధిక్యములు ఏమైనవి మామా?....
పాంచాలీ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...?
పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? ఇస్సీ... ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా?..
ఇపుడేదీ కర్తవ్యము? మనుటయా.. మరణించుటయా.. ఏదీ కర్తవ్యము ?
dhanyavadamulu ..... sarididhukoni malli prachuristhanu :)
రిప్లయితొలగించండిచిన్న అచ్చు తప్పు మిగిలి పోయినట్లున్నది....సంతానవితానములకాలావాలమగు...అన్న చోట..సంతానవితానములకాలవాలమగు.. అని ఉండాలనుకుంటాను.ఇంక అసుపరిత్యాగము అన్న మాట ప్రాణ పరిత్యాగము అనే భావన లో వాడబడింది. శ.ర. నిఘంటువులో అసువులు అని బహుమచన రూపము మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఎందువలనలో తెలియదు. అసువు అనే ఏకవచన రూపము ఉందనుకున్నా అసుపరిత్యాగము అనేది ఎంతవరకూ సరియైనదో పెద్దలు పండితులు చెప్పాల్సిన విషయం.
రిప్లయితొలగించండితెలుగు దేశంలో చదువుకొనక పోయినా మీరు మంచి తెలుగే వ్రాస్తున్నారు.ఇది మెచ్చుకోదగ్గ విషయమే. తప్పులెన్నాలని కాదు కానీ మీరు అడిగారు కనుక మీ పోస్టులోని తప్పుల్ని సరిచేసుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తున్నాను:
రిప్లయితొలగించండితప్పు ఒప్పు
విద్యాబ్యాసం విద్యాభ్యాసం
తెలుగు నెల తెలుగు నేల
గుణించడం గణించడం (లెక్కపెట్టడం)
దాన వీరసూర కర్ణ దాన వీర శూరకర్ణ
పత్రాలవైసిష్ట్యత పాత్రల వైశిష్ట్యత
పంచాలి పాంచాలి
మీరు నిర్దుష్టమైన భాష వ్రాయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక చూపించడం జరిగింది. మీ తప్పు కాకపోయినా డైలాగ్ లో ఒక చోట "జిగృక్షాపేక్ష" అన్న పదం వాడబడింది. జిగృక్ష అటేనే గ్రహింపనిఛ్ఛ అని అర్థం. దానికి మరల అపేక్ష (ఇఛ్ఛ) అని చేర్చడం భావ్యం కాదని నా భావన.పెద్దలు కామేశ్వర రావుగారు సంశయనివృత్తి చేయగలరు.
సహనంతో మా తప్పులను సరిదిద్దినందుకు కృతజ్ఞతలు :)
తొలగించండిగోపాలక్రిష్ణారావుగారు,
తొలగించండి"అసు" అన్న సంస్కృత శబ్దంనుండి వచ్చిన తత్సమాలు "అసువు", "అసువులు". తెలుగులో "అసువు" అన్న ఏకవచన ప్రయోగం ఎక్కడా కనిపించకపోవడం వల్ల బహుశా శబ్దరత్నాకరంలో ఆ పదం ఇవ్వలేదేమో. బ్రౌను నిఘంటువులో ఉంది. ఏదేమైనా, తత్సమ పదాలతో సమాసం చేసినప్పుడు, మొదటి పదంలో, తెలుగులో వచ్చి చేరే విభక్తిప్రత్యయాలు పోయి, మూల సంస్కృతపదమే వస్తుంది. అంచేత "అసుపరిత్యాగము" సరైన పదమే.
జిఘృక్షాపేక్ష - నిజమే, అపేక్ష పునరుక్తిలాగ తోస్తుంది. అయితే అపేక్ష పదానికి ఆశ అనే అర్థం కూడా ఉంది కదా. కోరికకి, ఆశకి తేడా ఉంది కాబట్టి, ఇక్కడ మొదటి పదానికి పొందాలనే కోరిక, రెండవ పదానికి ఆశ అనే అర్థాలు తీసుకుంటే పునరుక్తి దోషం పోయి మరింత అర్థవంతమవుతుంది.
నాకు చాలా సంతోషం కలిగినది చాలా చాలా బాగుంది ఫుల్ హ్యాపీ
రిప్లయితొలగించండిS V R gari dialogues try cheyandi please
రిప్లయితొలగించండిSUPER
రిప్లయితొలగించండిఅద్భుతం... అత్యద్భుతం...
రిప్లయితొలగించండి